Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎన్నికల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 

ఎన్నికల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముధోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు .ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని అన్నారు. సమయానికి ఎన్నికల ప్రక్రియను మొత్తం ముగించాలని పేర్కొన్నారు.

ఈ పోలింగ్ కేంద్రం తనిఖీలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ప్రత్యేక అధికారి  సుదర్శన్, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -