Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 499 శివారు ప్రాంతంలో  20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్  నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పనులు నాణ్యతాప్రమాణాలకుఅనుగుణంగావేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ వెంట ఈ ఈ సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.                                                                                          

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -