– ప్రజావాణికి తరలివచ్చిన చింతమాన్ పల్లి గ్రామస్తులు
నవతెలంగాణ – కామారెడ్డి
తమకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇప్పించాలని దోమకొండ మండలం చింతామన్ పల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం తరలివచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా తాము ఇన్నను నిర్మించడం ప్రారంభించామని కింద బేస్మెంట్, పిల్లల్రు లేచే వరకు అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకువచ్చి ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నామని అన్నారు.
ప్రభుత్వం నుండి ఇప్పటివరకు రూపాయి బిల్లు రాలేదని అప్పులు చేసి ఇండ్ల నిర్మించుకుంటున్నామని, ఇప్పటివరకు రూ. 3 లక్షలకు పైగా అయ్యాయని, బేస్మెంట్ పూర్తయితే లక్ష రూపాయలు ప్రభుత్వం మొదటి దశ ఇస్తుందని చెప్పారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ బిల్లు రాలేదని, మా మండలంలోని ఇతర గ్రామాలైన సంగమేశ్వర్, అంచనూరు గ్రామాల లబ్ధిదారులకు ఇప్పటికీ రెండు సార్లు బిల్లులు మంజూరు అయ్యాయని తమకు మాత్రం ఒక్కసారి కూడా మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు తరలివచ్చిన వారిలో కొండ నరసవ్వ, ఎన్నారం బయన్న, సాకలి రాజు, నీల లావణ్య, జనుక పెద్ద నరసింహులు, జింక నరసవ్వ, పస్సుల నరసవ్వ తదితరులు తరలివచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇప్పించండి కలెక్టర్ సార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES