Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ గారు మా గోస చూడండి ఒకసారి 

కలెక్టర్ గారు మా గోస చూడండి ఒకసారి 

- Advertisement -

– కామారెడ్డి ఇంటిగ్రేట్ బాలికల వసతి గృహ విద్యార్థుల ఆవేదన 
– ఆర్టీసీ బస్సు నడుపుతే బాగుంటుంది అన్న ఉపాధ్యాయుడు 
నవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల బాలికల ఇంటిగ్రేడ్ వసతి  గృహ విద్యార్థినిలు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కామారెడ్డి లో గల ఈ వసతి గృహం నుండి ప్రతిరోజు ఈ వసతి గృహంలో ఉండే 200 మంది బాలికలు టేక్రియాలలో గల బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళవలసి ఉంటుంది. విద్యార్థినిలు తమ పాఠశాల నుండి టేక్రాల వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లి రోడ్డుపై బస్ దిగి స్కూలుకు వెళ్లాలంటే  సుమారు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళవలసి ఉంటుంది. సమయానికి బస్సులు రాక వచ్చిన బస్సులు ఆపక సమయానికి ఈ విద్యార్థినులు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. ఆలస్యంగా వెళ్లడం వల్ల  ఉపాధ్యాయులతో చివాట్లు పడవలసి వస్తుంది. కలెక్టర్ స్పందించి ఆర్టీసీ బస్సు ఇంటిగ్రేడ్ వసతి గహం నుండి టేక్రియాల పాఠశాల వరకు ఉదయం సాయంత్రం బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల సైతం కోరుతున్నారు.
పాఠశాలకు వెళ్లాలంటేనే భయంగా ఉంది ( రష్మిక పదవ తరగతి విద్యార్థిని )
మేముండే వసతి గృహం నుండి టేక్రియాల్ పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడి నుండి అక్కడికి వెళ్లాలంటే బస్సులో వెళ్లిన సగం దూరం వరకే వెళ్లడం జరుగుతుంది. అక్కడనుండి కిలోమీటర్ ఆపై నడవవలసి ఉంటుంది దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు బస్సు సౌకర్యం కల్పించాలి.
ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి బస్సు ఏర్పాటు చేయాలి ( కరుణాకర్ పాఠశాల ఉపాధ్యాయుడు )
ఇంటిగ్రేడ్ వసతి గృహం నుండి టేక్రియాల్ పాఠశాలకు రావాలంటే 200 మంది విద్యార్థినిలు బస్సులో కొందరు, మరికొందరు నడుచుకుంటూ రావడంతో స్కూల్కు ఆలస్యంగా వస్తున్నారు. దీంతో పాఠాలు మిస్ అవుతున్నారు. కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను ఆపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి వీరికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -