Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పీఆర్టీయూ టీఎస్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శనివారం కలెక్టరేట్ లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలని ఆకాంక్షించారు. పదవ తరగతి లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. విద్యతో పోటు విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధికి కృషిచేయాలన్నారు. ఉపాధ్యాయులుగా తమ వృత్తిలో మరింతగా రాణించాలన్నారు.

అనంతరం జిల్లా విద్యా శాఖాధికారి కె. అశోక్ టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పీఆర్టీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, తీగల నరేష్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చింత రెడ్డి రామలింగారెడ్డి, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు విప్పర్ల రమేష్, దండుగుల యల్లయ్య, గంజి శంకర్, నిమ్మని వెంకటేశ్వర్లు, దయాకర్, గుణగంటి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రమేశ్, ప్రతాప్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అల్లాడి సత్యనారాయణ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్ ప్రసాద్, షేక్ బషీర్, వినోద్, , వాసుదేవ రెడ్డి, జహీర్ ఖాన్, నల్ల శ్రీను, కిరణ్, చౌదర్ రెడ్డి, చక్రధర్,నాగయ్య, శ్రీనివాస రెడ్డి, పురుషోత్తం, లింగారావు వెంకట్ రెడ్డి, సోమయ్య, శంకర్ నాయక్, రవీందర్ రెడ్డి, రవీందర్, గోపిరెడ్డి, చంద్ర శేఖర్, సైదులు, రాష్ట్ర & జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -