బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్లు. విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో బుధవారం సాయంత్రం ప్రీమియర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సమర్పకుడు బన్నీ వాస్ మాట్లాడుతూ,’ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. డిమాండ్ పెరుగుతుండటంతో స్క్రీన్లను పెంచుకుంటూ వెళ్తున్నాం. అయితే ప్రీమియర్లతో రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్‌ని కూడా నేను తీసుకునేందుకు సిద్దంగా ఉన్నాను. దీపావళి పండుగ 21 అయితే.. నవ్వుల పండుగ మాత్రం ఈ రోజు సాయంత్రం మా ప్రీమియర్లతో స్టార్ట్ అయ్యింది. అందరూ ఫ్యామిలీతో సినిమాకు రండి.. హాయిగా నవ్వించి బయటకు పంపిస్తాం. మా సినిమా మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు.
కానీ మనలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందుకే నేను గట్టిగా, ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాను. కొంత మంది నిర్మాతలు తెలిసో తెలియక ఇలాంటి నెగెటివ్ క్యాంపైన్‌లను సపోర్ట్ చేస్తున్నారు. పక్క సినిమాని తొక్కాలని చూడటం మాత్రం చాలా తప్పు. ఒక మూవీని తొక్కితేనే ఇంకో మూవీ ఆడుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం. నా చేతిలో ఉన్న థియేటర్లకి కూడా మిగిలిన చిత్రాలకు ఛాన్స్ ఇచ్చాను. నా మూవీని రెండు షోలు వేస్తే.. మిగతా చిత్రాలకు రెండు షోలు ఇస్తున్నాను. అన్ని సినిమాలు బాగుండాలి.. అన్ని చిత్రాలు ఆడాలన్నదే నా ఉద్దేశం. బుక్ మై షోలోనూ ఇష్టమున్నట్టుగా రేటింగ్, లైక్స్ కనిపిస్తుంటాయి. ఎవరు లైక్ కొడుతున్నారు?, ఏ బేస్ మీద రేటింగ్ ఇస్తున్నారు? అనే బేసిక్ ఇన్ ఫో కూడా ఉండదు. టికెట్ కొనుక్కునే ఫ్లాట్ ఫాం మీద కూడా ఇలాంటివి ఉంటే ఎలా? బాగున్న సినిమాకు మంచి రేటింగ్ వస్తే పర్లేదు.. కానీ బాగున్న మూవీకి కూడా తప్పుడు రేటింగ్ ఇస్తే ఎలా? ఈ టాపిక్ మీద ఛాంబర్‌లోనూ చర్చించాం’ అని తెలిపారు.
ఫ్యామిలీతో రండి.. అందరినీ నవ్విస్తాం
- Advertisement -
- Advertisement -