కారకాస్ : అమెరికా జైలులో ఉన్న నికొలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ విడుదలకు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగుయెజ్ ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా సైన్యం మదురో దంపతులను అపహరించుకొని వెళ్లిన తర్వాత ఆమె ఆదివారం తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రోడ్రిగుయెజ్ నియామకం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెకు హెచ్చరికలు పంపారు. అమెరికాతో సహకరించకుంటే మదురో కంటే ఎక్కువ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు. ఇదిలావుండగా మదురో సోమవారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఫెడరల్ జడ్జి ముందు హాజరయ్యారు.
మదురోపై మోపిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశారు. అమెరికా దాడిలో మదురో భద్రతా బృందంలోని చాలా మంది చనిపోయారని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో లొపెజ్ చెప్పారు. అమెరికా దాడిలో సైనికులు, పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా గ్రీన్‌లాండ్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ ప్రధాని జెన్స్ ఫ్రెడ్రిక్ నెయిల్సన్ స్పందిస్తూ ‘ఇప్పటికిది చాలు’ అని అన్నారు. తాను గౌరవాన్ని కోరుకుంటున్నానని, చర్చలకు సిద్ధమేనని చెప్పారు. మదురోను అమెరికా సైన్యం పట్టుకున్నప్పటికీ వెనిజులాతో తమ సంబంధాలు కొనసాగుతాయని ఇరాన్ తెలిపింది. మదురోను వెంటనే విడుదల చేయాలని అమెరికాను ఇరాన్, చైనా దేశాలు కోరాయి.
మదురో దంపతుల విడుదలకు కమిషన్ : రోడ్రిగుయెజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



