దేశంలోనే కేరళలో మొదటిసారి
చైర్మెన్‌గా కె.సోమప్రసాద్
తిరువనంతపురం : వృద్ధుల సంక్షేమం కోసం కేరళ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కమిషన్‌ను నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిషన్‌ను బుధవారం నుంచి బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటిం చింది. రాజ్యసభ ఎంపీ, కొల్లాం జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త కె.సోమప్రసాద్ వృద్ధాప్య కమిషన్ చైర్మెన్‌గా నియమించింది. సభ్యులుగా అమరవిలా రామకృష్ణన్ (సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ), ఇ.ఎం.రాధ (మహిళా కమిషన్ సభ్యురాలు , సామాజిక కార్యకర్త), కెఎన్‌కె నంబూద్రి (రచయిత , సీనియర్ సిటిజన్స్ సర్వీస్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్) , ప్రొఫెసర్ లోపెజ్ మాథ్యూలు (కాలేజీ మాజీ అధ్యాపకులు, కొట్టాయం జిల్లా పంచాయితీ సభ్యులు, కుసాట్ , ఎంజి విశ్వవిద్యాలయాల సిండికేట్ సభ్యుడు) నియమితుల య్యారు. తిరువనంతపురంలోని సచివాలయంలో కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంత్రి ఆర్.బిందు సమక్షంలో నిర్వహించారు. నిర్లక్ష్యము, దోపిడీ, అనాథలు సహా వృద్ధుల జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పెరుగుతున్న ఆందోళనలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు మంత్రి ఆర్.బిందు తెలిపారు. వృద్ధుల హక్కులను పరిరక్షించడానికి, పునరావాసాన్ని సులభతరం చేయడానికి, వారి నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడేలా అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఈ కమిషన్ సహాయపడుతుందని అన్నారు.
వృద్ధుల సంక్షేమం కోసం కమిషన్
- Advertisement -
- Advertisement -