Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యల పరిష్కారానికి వార్డులను పరిశీలించిన కమీషనర్

సమస్యల పరిష్కారానికి వార్డులను పరిశీలించిన కమీషనర్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
ఆలేరు మున్సిపల్ కేంద్రంలో సత్వర సమస్యల పరిష్కారానికి పలు వార్డులు మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఏడో వార్డులో శివాలయం వీధి, మహాలక్ష్మి రైస్ మిల్ సమీపంలో ,నూనె మిల్ వీది, కట్టెగోమ్ముల   భాస్కర్ రెడ్డి, చాగంటి కృష్ణ నివాసాల సముదాయం, పట్టణంలోని మెయిన్ రోడ్, దుకాణ సముదాయాల వద్ద డ్రైనేజీ సమస్య విద్యుత్ దీపాల సమస్య పరిష్కరించాలని వ్యాపారస్తులు, స్థానికులు కోరడంతో అధికారులు నూతనంగా ఎంపికైన కౌన్సిలర్లు శనివారం ఉదయం మార్నింగ్ వాక్ లో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కౌన్సిలర్లు కలియతిరిగారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. పట్టణంలోని డ్రైనేజీ సమస్యను, విద్యుత్ దీపాల సమస్యను పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, 11వ వార్డు కౌన్సిలర్  జుకంటి సంపత్, నాయకులు ఎం ఏ ఎజాస్, బిజన భాస్కర్, జట్ట సిద్దులు, ముదిగొండ శ్రీకాంత్, తో పాటు పలువురు నాయకులు, మున్సిపల్ సిబ్బంది పరిశీలనలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -