- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికలకు రేపోమాపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో అశ్వారావుపేట మున్సిపల్ కమీషనర్ బి. నాగరాజు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసారు. ఇప్పటికే ఆయన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. శుక్రవారం ఆయన మున్సిపాల్టీ ఎన్నికల కోసం కేటాయించనున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గదులను సందర్శించి మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం లాంటి సౌకర్యాలను ప్రధానోపాద్యాయురాలు హరిత ను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -



