Tuesday, October 14, 2025
E-PAPER
Homeఖమ్మంమోడల్ కాలనీలో కలియతిరిగిన కమిషనర్ నాగరాజు  

మోడల్ కాలనీలో కలియతిరిగిన కమిషనర్ నాగరాజు  

- Advertisement -

– సమస్యలపై ఆరా
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని మోడల్ కాలనీలో కమీషనర్ నాగరాజు మంగళవారం కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మోడల్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. కాలనీలో నీటి సమస్యతో పాటు పరిసరాల అవగాహన, శుభ్రత పరిశుభ్రత సంబంధించి,వీధిలైట్లు నిర్వహణ పై ఆరాతీసారు.రోజు వారీ వచ్చే చెత్త బండిలో తడి చెత్త – పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని,ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. పల్లె దవాఖానా తో పాటు అంగన్వాడి స్కూల్ ను సందర్శించి పలు సూచనలు చేసారు.చుట్టు ప్రాంగణంలో వాతావరణం శుభ్రంగా ఉండాలి శుభ్రత – పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా పెట్టాలని అన్నారు.

అంగన్వాడి స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటూనే పిల్లలకు పోషక ఆహారంతో పాటు (మునగాకు) ముఖ్యంగా వాడాలి దానితోపాటు ఆకుకూరలు కచ్చితంగా మెనూలో ఉండాలి గర్భిణీలకు చిన్న పిల్లలకు మంచి మంచి కార్యక్రమాలతో పాటు ఆరోగ్య సలహాలు ఇవ్వాలి అన్నారు. మోడల్ కాలనీ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిండా హరిబాబు,తగరం   ముత్తయ్య,నార్లపాటి కాంతారావు,నార్లపాటి దివాకర్, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -