Tuesday, October 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారమివ్వాలి

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారమివ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలకు వరిధాన్యం, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతికందిన పంట పొలాలు వంగిపోయి మొలకెత్తినవని తెలిపారు. ఇప్పటికే ఐకేపీ కేంద్రాలకు చేరిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తడిసి ముద్దయ్యిందని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో వరి కుప్పలు మొలకెత్తాయని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడికక్కడ రాసులు పోసుకుని వానలకు తడుస్తూ, ఎండకు ఎండుతూ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐకేపీ కేంద్రాలను ప్రారంభిం చినా ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అధికార యంత్రాంగాన్ని కదిలించి అదనంగా ఐకేపీ కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వాటిలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. వర్షాలకు నష్టపోయిన వరి, పత్తి పంటల పొలాలను పరిశీలించి నష్టపరిహారం రైతులకు అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -