Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్లో ఇండ్లు, భూములకు పరిహారం ఇవ్వాలి

డేంజర్ జోన్లో ఇండ్లు, భూములకు పరిహారం ఇవ్వాలి

- Advertisement -

తహశీల్దార్ వినతిపత్రం సమర్పించిన భూ నిర్వాసితులు
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇప్పించాలని భూ నిర్వాసితులు తాండ్ర మల్లేష్, కేశారపు చెంద్రయ్య, ప్రహ్లాద్ శర్మ,రావుల అంజయ్య, కేశారపు నరేశ్, బూడిద సారయ్య, తాండ్ర మార్కు, ఇందారపు సమ్మయ్య, కుమార్ బుధవారం మండల తహశీల్దార్ రవికుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మంగళవారం జెన్కో, ఎనర్జీ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ కి వచ్చి డేంజర్ జోన్ లో ఉన్న ఇండ్లను ఓపెన్ కాస్ట్ వ్యూ పాయింట్ నుండి పరిశీలించి డేంజర్ జోన్లో ఉన్న 1080 ఇండ్లకు మాత్రమె నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి, ఇంటి స్థలం కలిపి ఒకేసారి లమ్సమ్ అమౌంట్ ఇస్తామని ఇవ్వుమని అన్నట్లుగా తెలిసిందన్నారు.

2008 సంవత్సరంలో ఇండ్లకు నంబర్స్ వేసి దాదాపుగా15 సంవత్సరాలు కావస్తునందున మైనర్లు మేజర్లుగా ఎదిగి పెళ్లి చేసుకొని  స్వంతంగా ఇండ్లు కట్టుకొని వారు వేరే కుటుంబంగా జీవిస్తునారు కాబట్టి 1080 ఇండ్లకు బదులుగా 30% పెంచి 1500 ఇండ్లకు గాను నష్టపరిహారం ఇవ్వాలని లేనిపక్షంలో పూర్వం నుండి తాడిచెర్ల గ్రామంలో నివసిస్తున్న అందరికీ ఇండ్లకు భూమికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరడమైనది లేనిపక్షంలో తాము ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -