నవతెలంగాణ – మద్నూర్
161 బిబి జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు, సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందించారు. ఈ క్రమంలో మద్నూర్ మండల కేంద్రం నుండి వాడేఫతేపూర్, సోనాల, తడి ఇప్పర్గా, లింబూర్, చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ తదితర గ్రామాల శివారు పరిధిలో నుండి బోధన్ కు వెళ్లే మద్నూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను, బాన్సువాడ సబ్ కలెక్టర్ ను రైతులు కలిశారు. ఎకరానికి రూ.45 లక్షల నుండి రూ.50 లక్షల వరకు నష్టపరిహారం అందించాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రయివేట్ పరంగా భూముల రేటు లక్షల్లో పలుకుతున్నాయని అన్నారు. ఎకరానికి రూ.45 నుండి రూ.50 లక్షలు పరిహారం అందిస్తే మాకు న్యాయం చేకూరుతుందని విన్నవించారు. ఇందుకు సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో మద్నూర్, వాడే ఫతేపూర్, సోనాల, తడి ఇప్పర్గా, లింబూర్, గ్రామాలకు చెందిన భూనిర్వాసితులు పాల్గొన్నారు.
భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES