నవతెలంగాణ – జన్నారం
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పై సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో అనవసరంగా కొందరు పనిగట్టుకుని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, వెడ్మ ఫౌండేషన్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కు మరియు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియాలో అబద్దాపు ప్రచారాలు చేస్తున్నారని అట్టి వారిపై కఠినర్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, సుధాకర్ నాయక్, మచ్చ శంకరయ్య, దుమల్ల రమేష్, నందు నాయక్, మామిడిపెళ్లి ఇందయ్య, లకావత్ తిరుపతి ,షాకీర్ అలీ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES