నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ శివారులోని సర్వేనెంబర్ 144లో ఉన్న తన ఎకరం భూమికి దారి ఇవ్వడం లేదంటూ రైతు ధనావత్ కిషన్ నాయక్ శనివారం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతు కిషన్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వానాకాలం పంట సాగు చేసేందుకు తాను పొలం వద్దకు వెళ్ళాననీ, ధనావత్ నాగ, ధనావత్ శ్రీను, ధనావత రిబ్బన్, దనావత్ జాను అడ్డుకున్నారని తెలిపారు.
దీంతో ఎకరం పొలం బీడు బీడుగా ఉంచామన్నారు. గతంలో దీని విషయమే ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు వచ్చే సర్వే చేశారని, ఇప్పటివరకు నివేదిక ఇవ్వకపోవడంతో తన పంట పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ యాసంగిలో పంట సాగు చేసుకొని ఇవ్వకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పోలీసులకు సైతం దీని విషయమై ఫిర్యాదు చేసిన తనకు న్యాయం చేయలేదని తెలిపారు. కౌలు రైతు సెక్షన్ 251 ప్రకారం తన పంట పొలానికి వెళ్లేందుకు దారి ఇప్పించాలని కోరారు.



