Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సాధ్యం

చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సాధ్యం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సాధ్యమవుతుందని ఐసీడీఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. గురువారం చలకుర్తిసెక్టార్ పరిధిలో ని కుంకకుడు చెట్టు తండా, బోనూ తల, తూర్పు పూలగూడెం గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ చేపట్టి తల్లులకుఅవగాహన కల్పించారు. ఈసందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ పిల్లలకు ఆటపాటలతో పాటు సృజనాత్మక పెంపొందించే విధంగా విద్యాబోధన ఉంటుందన్నారు. ఈ ఏడాది నుండి పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీలో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అలుగుబెల్లి లక్ష్మి, ప్రమీల, రాములమ్మ, గ్రామస్టులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -