Monday, November 3, 2025
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించండి: సీపీఐ(ఎం)

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించండి: సీపీఐ(ఎం)

- Advertisement -

సామినేని రామారావు హత్యపై సమగ్ర విచారణ జరపాలి
నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలి
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వైరా పట్టణంలో భారీ నిరసన ర్యాలీ
నవతెలంగాణ – వైరాటౌన్

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించాలని, సామినేని రామారావు హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావును అత్యంత దారుణంగా హత్య చేసిన హంతకులను, హత్య చేయించిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) వైరా పట్టణం, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయనే ధీమాతో, ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు, కోర్టులు తమను ఏమీ చేయలేవనే అహంకారంతో కాంగ్రెస్ గుండాలు హత్యా రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.

సీపీఐ(ఎం) ఎదుగుదలను ఓర్వలేక రాజకీయ కక్షతో మదిర నియోజకవర్గంలో సంవత్సర కాలంలో కాంగ్రెస్ గుండాలు రెండు రాజకీయ హత్యలు చేసిన ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావు ఇస్తుందని ఆయన అన్నారు.‌ హత్య రాజకీయాలతో సీపీ(ఎం) ఎదుగుదలను, ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు. రాజకీయ కారణాలతో సామినేని రామారావును కాంగ్రెస్ గుండాలు హత్య చేసి ఐదు రోజులు అవుతున్నా.. పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలిసులు కనీసం నిందితుల సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోలేదని అన్నారు. రామారావు హత్యతో కుటుంబం మొత్తం తీవ్ర బాధలో ఉంటే పోలీసులు విచారణ పేరుతో కుటుంబ సభ్యులను పదేపదే వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఒకవైపు తమకు డిప్యూటీ సీఎం అండ ఉందని, తమను ఎవరూ ఏమి చేయలేరని, హంతకులే ప్రచారం చేసుకుంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ నాయకులు రామారావు హత్యపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహం, సహకారంతోనే రామారావును హత్య చేశారని, పోలీసులు ఎటువంటి రాజకీయ ఒత్తిడీలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. హత్యకు సూత్రధారులు, పాత్రదారులు, వారి వెనుక ఉన్న పెద్దలు ఎవరో బయటపెట్టాలని, పోలీసులు హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణం, రూరల్ కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా మణి, తోట నాగేశ్వరరావు, మాగంటి తిరుమలరావు, నాయకులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు పైడిపల్లి సాంబశివరావు గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, రాచబంటి బత్తీరన్న, షేక్ నాగుల్ పాషా, బాజోజు రమణ, కిలారు శ్రీనివాసరావు, కారుమంచి జయరావు, షేక్ మజీద్, కామినేని రవి, తోట కృష్ణవేణి, అనుమోలు రామారావు, షేక్ మజీద్ బి, భుక్యా విజయ, మాడపాటి సుజాత నర్వనేని ఆదిలక్ష్మి, చావ కళావతి, మల్లెంపాటి రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి మల్లికార్జునరావు, షేక్ జమాల్ సాహెబ్, సంక్రాంతి పురుషోత్తమరావు, ఏరువ నిరశింహారావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, కొత్త సీతారామయ్య, మాడపాటి రామారావు, ఓర్సు సీతారాములు, యనమద్ది రామకృష్ణ, నల్లమల కోటేశ్వరరావు, గరిడేపల్లి సుబ్బారావు, షేక్ కాజామియా, నారికొండ అమరేందర్, అమరనేని కృష్ణ, వడ్లమూడి మధు, గుత్తా వాసు, నూకల వెంకటేశ్వరరావు, వేల్పుల మైఖేల్, పాసంగులపాటి చలపతిరావు, షేక్ అబ్దుల్ రహిమాన్, షేక్ జానిమియా, షేక్.బిలాల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -