- Advertisement -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల నిమ్స్‌లో గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నిమ్స్‌లో చేరిన ఆమెకు గురువారం శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఆమెను పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను కలిసి విమలకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆమె వెంట కుమారుడు సూర్యం కుటుంబ సభ్యులు ఉన్నారు.
- Advertisement -



