Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించండి

ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించండి

- Advertisement -

– సుప్రీంకోర్టు ఆదేశం
న్యూడిల్లీ:
నీట్‌ పీజీ-25 ప్రవేశపరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ పరీక్షను జూన్‌ 15న రెండు విడతల్లో నిర్వహించి, జులై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (ఎన్‌ఈబీ) ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ప్రవేశపరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్‌ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దానిని ఒకేవిడతలో నిర్వహించేలా బోర్డ్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్‌ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad