జాతీయ బ్యాంకుల్లోనే కూలీల వేతనాలు
ప్రయివేట్ బ్యాంకుల్లో జమకావు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం వేతనాల చెల్లింపులపై తాజాగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై ఉపాధిహామీ చెల్లింపులన్నీ జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల ఖాతాల్లోనే లావాదేవీలు జరగనున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చాయి. అయితే ఎప్పటినుంచి ఈ విధానం అమలవుతుందనేది స్పష్టతలేదు. కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ హామీ పథకాన్ని ఇటీవల వీబీ జీ రామ్ పేరున మార్పులు చేర్పులు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాత పథకమే అమలవుతోంది. కొత్త వీబీ జీ రామ్ పథకం ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి రానున్నదని అధికారులు పేర్కొంటున్నారు. వేతనాల చెల్లింపులపై కూడా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్తరూల్స్ అమల్లోకి రావచ్చొని భావిస్తున్నారు.
ఇబ్బందులు ఇలా..
ఇప్పటివరకు కూలీలు వివిధ బ్యాంకుల్లో వారి ఖాతాలు ఉన్నాయి. కొత్తరూల్స్ ప్రకారం కూ లీల ఖాతాలు ప్రైవేట్ బ్యాంకులు, జాతీయకరణ పొందని కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో కలిగిఉంటే వారిఖాతాల్లో వేతనాలు జమకావు. కేవలం జాతీయ బ్యాంకులు పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే వేతనాలు జమకాను న్నాయి. జాతీయబ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సి ఉంది. దీంతో కూలీలు వ్యయ ప్రయాసలకు గురికావల్సి వస్తుందంటూ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం జాబ్ కార్డులు8,495,మొత్తం కూలీలు 18,873,యాక్టివ్ కూలీలు10,632 ఉన్నారు.
బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బంది : బూడిద రాజసమ్మయ్య…ఉపాధి కూలి
ఉపాధికూలీల వేతనాలు పాతనిబంధనల ప్రకార మే కొనసపాగించాలి. ప్ర భుత్వం కొత్తరూల్స్ కూలీలకు ఇబ్బందులు తప్పవు. కూలీలు కొత్త ఖాతాలు తెరవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కావున గతంలో ఉన్న విధానమే కొనసాగించేలా ప్రభుత్వం పునరాలోచించాలి.
ఇబ్బందులు లేకుండా చూడాలి: ప్రయివేట్ బ్యాంకుల్లో జమకావు…హరీష్ ఉపాధి ఎపిఓ
ఉపాధి కూలీలు తప్పని సరిగా జాతీయ బ్యాంకుల్లో,పోస్టాఫీసుల్లో మాత్రమే ఖాతాలను కలిగి ఉండాలి. డీసీసీబీ మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలను కలిగి ఉంటే వేతనా లు జమకావు.ఈ విషయం కూలీలు గమనించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.



