Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన..

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ పి ఎం ఎస్ ఆర్ హెచ్ ఐ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బాల్ బ్యాడ్మింటన్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది అని మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట ఆంజనేయులు తెలిపారు. ఈ పాఠశాల నుంచి బాలికల విభాగంలో ముగ్గురు నందిని, గాయత్రి, నౌషీన్, బాలుర విభాగంలో ముగ్గురు కన్నయ్య, సాయికుమార్, ఋషికేశ్ లు ఎంపిక కాగా వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈనెల 12, 14 వ తేదీలలో జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు శ్యామ్, కృష్ణమూర్తి, రాజశేఖర్, భాగ్య మేడం తో పాటు పి ఆర్ టి యు మండల కార్యదర్శి కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు నాందేవ్, శంకర్, గంగాధర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad