రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జనాలకు పాల్పడిందని బీఆర్‌ఎస్ విమర్శించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్‌ను బుధవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, సదానందం, కిరణ్ గౌడ్, ఫయాజుద్దీన్ కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రామ్మూర్తి మాట్లాడుతూ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దుర్వినియోగానికి పాల్పడింని చెప్పారు. ఓటర్లను ప్రలోభ పెట్టింన్నారు. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో ఇష్టానుసారంగా ఓటర్లను భయపెట్టిందని అన్నారు.
గత రెండు రోజులుగా తాము అనేక ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చెప్పారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘమా?, లేక రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘమా?అని ప్రశ్నించారు. మంత్రులే కాన్వాయ్ వేసుకుని వెళ్లి ఓట్లు వేయిస్తున్నారని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి కాంగ్రెస్ గెలవాలని చూసిందని వివరించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసింని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులను కిడ్నాప్ చేసింని అన్నారు. కాంగ్రెస్ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



