Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి పుష్పలీలను అధిక మెజారిటీతో గెలిపించాలి 

కాంగ్రెస్ అభ్యర్థి పుష్పలీలను అధిక మెజారిటీతో గెలిపించాలి 

- Advertisement -

పాలకుర్తి రిజర్వాయర్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తా 
పాలకుర్తిలో స్టేడియం నిర్మాణం కోసం కృషి : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ 
నవతెలంగాణ-పాలకుర్తి

పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమ్మగాని పుష్పలీలను అధిక మెజారిటీతో గెలిపించుకొని పాలకుర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ప్రజలను కోరారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి ప్రజల కల సహకారం అయ విధంగా పెండింగ్లో ఉన్న పాలకుర్తి రిజర్వాయర్ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

15 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని పాలించిన నాయకుల నిర్లక్ష్యం మూలంగా రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదని, గత ఐదు సంవత్సరాలుగా రైతులు పంటలు పండించుకోకుండానే తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రాబోవు రెండేళ్లలో రిజర్వాయర్ పనులను పూర్తిచేసే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రిజర్వాయర్ పనులకు భూమి పూజ చేశామని, నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ పనులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేందుకు దృష్టి పెట్టారని తెలిపారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్న, గ్రామాలు అభివృద్ధి చెందాలన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం పాలకుర్తిలో స్టేడియం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పేరున స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏకకాలంలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, సన్నధాన్యం పండించిన రైతులందరికీ క్వింటాలకు 500 బోనస్లతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలందరికీ సన్నబియ్యం తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. పాలకుర్తి తో పాటు పాలకుర్తి మండలం లని గ్రామాలు

 అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలకు పాల్పడుతున్నాయని, ప్రజలను మభ్య పెట్టేందుకు కల్లబొల్లి మాటలు చెబుతున్నాయని ఆరోపించారు. 2023 సార్వత్రిక ఎన్నికల తరహాలో పాలకుర్తి తో పాటు పాలకుర్తి మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని పుష్పలీల నాగన్న గౌడ్ లతోపాటు పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మాజీ సర్పంచుల గంగు కృష్ణమూర్తి, వీరమనేని యాకాంతరావు, కమ్మగాని ఆంజనేయులు గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, నాయకులు పెనుగొండ రమేష్, ఎడవల్లి సోమల్లయ్య లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -