నవతెలంగాణ – తలకొండపల్లి
బీసీ అభ్యర్థికి బీ ఫాం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని యూసుఫ్ గూడా లో కేక్ కట్ చేసిన దేవుని పడగల్ మాజీ సర్పంచ్ కాడ మౌని శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ జోగు రమేష్, మాజీ ఉపసర్పంచ్ జల్లెల శ్రీశైలం యాదవ్, అంబటి బిక్షపతి, బర్ల రఘుపతి, బండగల కృష్ణ, గురిగళ్ళ కరుణాకర్ జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడా స్థానిక నాయకులతో చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ బీజేపీ,బీఆర్ఎస్ లు అగ్రవర్ణాలకు మాత్రమే టికెట్లు ఇస్తుంటే, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ప్రాధాన్యమిస్తూ టికెట్ ఇచ్చింది. ఇది ఇతర పార్టీలకు సాధ్యం కాని పని అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అలాగే అగ్రవర్ణాలకు చెందిన పేద ప్రజలు కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో పి ఎస్ ఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్షిప్ చైర్మన్ కాసు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, మాజీ ఎంపిటిసి రమేష్, మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం యాదవ్, కార్యకర్తలు నరసింహారెడ్డి, బిక్షపతి, రఘుపతి, కృష్ణ, కరుణాకర్ పాండు, పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
బీసీ అభ్యర్థికి బీ-ఫాం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



