– భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనేక సంస్కరణలు తెచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని అవడమంటే దేశానికి గ్రహణం పట్టినట్టు అని కేంద్ర మంత్రి బండి సంజరు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2009లో ప్రధానమంత్రి కావాలని అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ కాలేదనీ, గుజరాత్‌లో నరేంద్రమోడీ పారాచూట్ నాయకునిగా వచ్చి సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తెచ్చిన రాజ్యాగంంతోనే సామాన్యులకు పదవులు వచ్చాయనీ, అందులో భాగంగానే బండి సంజరు కూడా కేంద్ర మంత్రి అయ్యారని తెలిపారు.
ఆయకట్టును స్థిరీకరించాలి : మంత్రి ఉత్తమ్‌కు వినతి
సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వేయర్ నుంచి డి10 కెనాల్ నుంచి జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వేయర్ డి3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టును స్థిరీకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్ పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల పరిధిలోని సుమారు 7 వేల ఎకరాలకు రంగనాయక సాగర్ డి10 కెనాల్ కింద స్థిరీకరించాలని విజ్ఞప్తి చేశారు.
బండి సంజరు వ్యవహారశైలి మార్చుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమ హక్కు అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజరు కాదనీ, ప్రజలే న్యాయ నిర్ణేతలని గుర్తుచేశారు. బీజేపీ దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టిందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ వల్లే సామాన్యులకు పదవులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



