Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకుల విద్యార్థులకు అన్నం పెట్టలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం

గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం

- Advertisement -

బీఆర్‌ఎస్‌వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గురుకుల విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టలేని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం, జూకల్‌ శివారులో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో భోజనం సరిగ్గా పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహంతో హైవేపై అన్నం ప్లేట్లు పడేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం సిగ్గుచేటని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో దాదాపు వందకుపైగా విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా, కల్తీ ఆహరం తిని ఆస్పత్రుల పాలైనా సీఎం రేవంత్‌రెడ్డికి కనీసం సమీక్ష నిర్వహించాలనే ఆలోచన రావడం లేని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో యూనిఫారాలు అందించకపోవడంతో, గతేడాది ఇచ్చిన వాటితోనే పాఠశాలలకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.కోట్ల ప్రజా ధనంతో అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ సర్టిఫికెట్‌ కొనుక్కున్న రేవంత్‌ రెడ్డి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో కనీసం అన్నం పెట్టని పరిస్థితిలో ఉండడం అత్యంత బాధాకరమని తెలిపారు. ప్రభుత్వ బడులను గాలికి వదిలేసి కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -