Monday, January 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల శత్రువు కాంగ్రెస్సే

ప్రజల శత్రువు కాంగ్రెస్సే

- Advertisement -

– మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట

మోసకారి కాంగ్రెస్‌ను ఓడించి అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదే బీఆర్‌ఎస్‌ సైనికుల నినాదమన్నారు. ఆదివారం సూర్యాపేటలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీనే ప్రజల శత్రువని వ్యాఖ్యానించారు. 2014 కు ముందు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన కూడా అట్లానే ఉందని విమర్శించారు. గ్యారంటీకార్డులపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాలేదని, వాటిని ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధికి రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మంచిఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసమే రేవంత్‌ అమ్ముడుపోతున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ మంత్రులపై ఆరోపణలు వస్తేనే అధికారులు స్పందిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్‌, కేటీఆర్‌లపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినప్పుడు, తప్పుడు రాతలు రాయించినప్పుడు స్పందన లేదని విమర్శించారు. గాంధీభవన్‌, సీఎం కార్యాలయం నుంచి గోస్ట్‌ సైట్లు పనిచేస్తున్నాయని, వాటి నుంచే తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు పాటించాల్సిన అవసరం ఉందని, ఎవరి మీదైనా తప్పుడు రాతలు వస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -