నవతెలంగాణ – కంఠేశ్వర్
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూనమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంత రెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ ..రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో దేశానికి ప్రధాని అయిన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని దేశసేవ కోసమే వారి కుటుంబం అంకితమైందని ఆయన తెలిపారు.
18 సంవత్సరాల వయసులోని యువతకు ఓటు హక్కు కల్పించి తమకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించిన నాయకుడని,అదే విధంగా ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లమాత్మకంగా దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడని, అదే విధంగా గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు బాగుంటాయి అని చెప్పిన గాంధీజీ మాటలను నమ్మిన ఆయన గ్రామపంచాయతీలకే నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆర్టికల్ 73, 74 సవరణ ద్వారా నేరుగా గ్రామపంచాయతీలకే నిధులు అందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. అదేవిధంగా రాంభూపాల్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ తీసుకున్న సుదీర్ఘ నిర్ణయాల వలన ఈ రోజు దేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో ముందుంది అని తెలిపారు.
దేశానికి ఐటీ రంగాన్ని అందించిన నాయకుడని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణ వల్లనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది అని, యువతకు 18 సంవత్సరాలలో ఓటు హక్కు కల్పించడం గాని, నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం గాని రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, యాస్ సి సెల్ నగర అధ్యక్షులు వినయ్, అవిన్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు సుభాష్ జాదవ్, లవంగ ప్రమోద్, రాజేంద్రప్రసాద్, బంటు బలరాం, అపర్ణ,ఆడే ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES