నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని గంట్లకుంట, కాన్వాయిగూడెం గ్రామాలకు చెందిన తండాల మంజూల (40), ముత్యం మల్లయ్య (75), చెన్న నర్సమ్మ (94) వేరువేరు కారణాలతో మృతి చెందారు. బాధిత కుటుంబాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో నాయకులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సురేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలే పట్టుకొమ్మలని, ఆపదలో వారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, మండల సీనియర్ నాయకులు ఎండీ ముక్తార్ పాషా, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, గ్రామ సీనియర్ నాయకులు మిట్ట తిరుమల్ రెడ్డి, చెన్న బాలరాజు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు తాండాల యాకన్న, యూత్ నాయకులు ఎడవెల్లి సోమేష్, రసాల సోంమల్లు, అరవింద్, చింతల వెంకటేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య ఉన్నారు.
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES