Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్ రక్తదానం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి

 రక్తదానం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జగడం నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి రక్తదానం చేశారు.  హైదరాబాద్ లోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగడం నారాయణ కి (బి-) నెగిటివ్ బ్లడ్ అవసరమై ఉన్నందున సామాజిక మధ్యమంలో పోస్ట్ చేసిన వెంటనే సంప్రదించి నేనున్నానని ముందుకు వచ్చి   ఆర్మూర్ చెందిన  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్  పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. తమ అమూల్య రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని తన మాటల్లో చెప్పడం జరిగింది. ఇంత గొప్ప మనసున్న వినయ్ రెడ్డిని పేషెంట్ వాళ్ళ బంధువులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -