Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ బాకీ కార్డు కరపత్రాల విడుదల

కాంగ్రెస్ బాకీ కార్డు కరపత్రాల విడుదల

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్
మంగళవారం బిఆర్ఎస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాజిరెడ్డి జగన్ తన నివాసంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా కూడా ఇప్పటికి తమ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన గ్యారెంటీ కార్డు ప్రకారం ఇవ్వాల్సిన బాకీ కార్డ్ కరపత్రాన్ని తమ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. ఇప్పటికీ రైతు భరోసా, ఆటో కార్మికుల హామీ, వరి పంటకు బోనస్, విద్య భరోసా కార్డు, కళ్యాణ లక్ష్మి తుల బంగార పథకం, ఇలాంటి అనేక పథకాలను ప్రజలకు అమలు చేయకుండా మోసగిస్తుందని, అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చిందినీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ఇచ్చిన హామీలు అమలు ఏ విధంగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందని తెలిపారు.

అలాగే కార్యకర్తలకు రాబోయే ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేస్తూ ఈ బాకీ కార్డును గ్రామంలోని ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలని ఆయన కార్యకర్తలు కోరారు. అలాగే రాష్ట్ర  ముఖ్యమంత్రి నియంతల వ్యవహరిస్తున్నాడని బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సుభిక్షంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొందరు కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్ళినా కూడా పార్టీకి నష్టం లేదని, పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీని వదలకుండా వెళ్లినవారు నిజమైన కార్యకర్తలని, వారే నిజమైన కేసీఆర్ సైనికులు తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అలాగే ఇతర పార్టీ నాయకులు మనల్ని మభ్యపెడతారని వారి మాటలను నమ్మి మోసపోవద్దని ఏ సమస్య ఉన్న నన్ను కానీ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ సంప్రదించాలని ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. కచ్చితంగా మన ఐక్యంగా ఉంటే మళ్ళీ రూరల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అడ్డ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  దేవేందర్, మోచ్చ శ్రీనివాస్, న్యాల్కల్ శ్రీనివాసరావు, కంజర్ భూమయ్య ,ముత్యం రెడ్డి, నర్సారెడ్డి, సుమన్, గోపాల్ రెడ్డి, సాంగ్య నాయక్, అన్నం సాయిలు, గోపాల్ నాయక్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -