మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలసీల పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంలు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 10 వేల ఎకరాల విలువైన భూములను కారుచౌకగా రేవంత్‌రెడ్డి ఆత్మీయ బంధువులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు 40 మంది ఉన్నారనీ, త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని చెప్పారు. వారికే రూ.నాలుగు కోట్ల ఆస్తిని ట్టబెట్టినట్టు తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఈ హిల్ట్ పాలసీ ఉద్దేశమన్నారు.
నాచారం, బాలానగర్‌లో గజం రూ.1.50 లక్షలు మార్కెట్ ధర ఉంటే, రూ.10 వేలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారి ఇండ్లను కూలగొట్టిన కాంగ్రెస్ ప్రజల భూములను ఇష్టం వచ్చినట్టు రేవంత్‌రెడ్డి బంధువులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక దొంగలు ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సంతకాలు పెట్టే అధికారులు ఇబ్బందులు పడతారని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో పాలసీ ఉంటే దాన్ని అమలు చేయకుండా కొత్త పాలసీ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, అనంత్ తదితరులు పాల్గొన్నారు.
పాలసీల పేరుతో కాంగ్రెస్ స్కాంలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



