కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్
20% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అధికం
నవతెలంగాణ – ఆలేరు
గత 15 రోజులుగా ఉత్కంఠ రేపిన ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. జిల్లా కేంద్రం భువనగిరిలో శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చిన ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన కాంగ్రెస్.బి. ఆర్. ఎస్. బిజెపి కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. ఆలేరు పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కౌన్సిలర్లు అందరు కృషి చేయాలని కోరారు. మొత్తం 12 వార్డులకు 7 కాంగ్రెస్ గెలుచుకో గా 3 బిఆర్ఎస్. 2 బిజెపి గెలుచుకుంది.మొత్తం ఓట్లు 12 వార్డులకు 11423 ఓట్లు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి సిపిఐఎం నాలుగు పార్టీలకు వచ్చాయి.
ఇందులో 6193 ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి. ముందంజలో ఉంది 3952 ఓట్లు బిఆర్ఎస్ వెనుకబడింది.కాంగ్రెస్ పార్టీకి 2241 ఎక్కువ ఓట్లు వచ్చాయి.దీంతో 20% ఓట్లు అధికంగా అధికార పార్టీ సాధించింది.కాంగ్రెస్ పార్టీకి 54.2 శాతం ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి34.6 ఓట్లు బిజెపికి 9.7 (1103)ఓట్లు సిపిఐ ఎం పార్టీకి 1.5(175) ఓట్లు. వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ ఆలేరు పట్టణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఏమాత్రం ఓటింగ్ తగ్గలేదు అన్నారు. ప్రతిపక్ష పార్టీబీఆర్ఎస్ కంటే 20 శాతం అధికంగా ఓట్లు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఒకటో వార్డు నుండి పాకాల మౌనిక హరీష్.రెండో వార్డు మరియమ్మ మార్క్. మూడో వార్డు యాట శివ. నాలుగో వార్డ్ బిజిన కళ్యాణి మధు.ఐదో వార్డ్ పాశి కంటి సంపత్ ఆరవ వార్డు అంగిడి ఆంజనేయులు ఏడవ వార్డు బిజన బాలమణి భాస్కర్ 8వ వార్డ్ బొట్ల సంపత్ 9వ వార్డు.పస్తం ఆంజనేయులు పదో వార్డ్ మల్లెల సరితా శ్రీకాంత్ 11వ వార్డు సంపత్ 12వ వార్డు జట్ట సిద్ధులు. కౌన్సిలర్లుగా గెలుపొందారు.



