Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -

బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 
నవతెలంగాణ – పెద్దవంగర

అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను, వృద్ధులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బాకీ కార్డును గడపగడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు యాదగిరి రావు, సంజయ్ కుమార్, సుధీర్, సమ్మయ్య, సుధాకర్, భాస్కర్, రఘు, రవి, అశోక్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -