Saturday, October 18, 2025
E-PAPER
Homeక్రైమ్కత్తిపోట్లతో కానిస్టేబుల్ మృతి

కత్తిపోట్లతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -


పాత నేరస్థుడిని స్టేషన్ కు తీసుకెళ్తుండగా దాడి
అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిసిఎస్ ఎస్ఐ పై సైతం దాడి
పరారీలో నిందితుడు
నవతెలంగాణ- కంటేశ్వర్

పాత నేరస్థుడని స్టేషన్కు తరలిస్తుండగా సదరు నిందితుడు సిసిఎస్ కానిస్టేబుల్ ను కత్తితో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిసిఎస్ ఎస్ఐ పై దాడి చేసి పరార్ అయ్యాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన రియాజ్ పలు దొంగతనాల కేసులో పాతనేరస్తుడు. నగరంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న విఠల్ తో పాటు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పాత నేరస్తుడు రియాజ్ ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ ను స్టేషన్ కు తరలించేందుకు ప్రమోద్ బైక్ నడుపుతుండగా నేరస్థుడు వెనుక కూచున్నాడు. వారిద్దరిని మరో బైక్ లో ఎస్ఐ ఫాలో చేస్తుండగా వినాయక్ నగర్ ప్రాంతంలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పలు మార్లు పొడిచాడు.. అతన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఎస్ఐ పై దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ను అదే రోడ్ లో వెళ్తున్న మోపాల్ ఎస్ఐ తన వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు.సీసీఎస్ ఎస్ఐ విఠల్ ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందని తెలిసింది. ఇటీవల బదిలీలో సీసీఎస్ కానిస్టేబల్ ప్రమోద్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ కు బదిలీపై వచ్చినట్లు సమాచారం. అతని సోదరుడు కూడా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. నేరస్తుడి దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. పరారీలో ఉన్న నిందితుడు రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రియాజ్ సమద్ అనే గ్యాంగ్ కు చెందిన సభ్యుడని తెలిసింది. రియాజ్ పై దొంగతనాలు, హత్య కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదని నింపింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -