Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన కానిస్టేబుల్ యాదగిరి

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన కానిస్టేబుల్ యాదగిరి

- Advertisement -

 నవతెలంగాణ – మిరుదొడ్డి 
ఇటీవల చిట్టాపూర్ గ్రామానికి బతుకుదెల కోసం వచ్చిన కుటుంబం  పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వేరే దేశం నుంచి చిట్టాపూర్ గ్రామంలో  గత ఆరు సంవత్సరాల క్రితం బతుకుదేరువు కోసం వచ్చిన తర్వాత వారి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి యజమాని మరణించడంతో వారి కుటుంబం రోడ్డుపాలయ్యింది. తినడానికి తిండి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అక్బర్ పేట భూంపల్లి మండల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న యాదగిరి కి తెలవడంతో ఆ కుటుంబానికి కనీసం తినడానికి తిండి అందిస్తే బాగుంటుందని ఉద్దేశంతో నిత్యవసర వస్తువులను అందించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లో ఎంతో సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు. యాదగిరి నిరుపేద కుటుంబానికి సరుకులు అందించడంతో గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -