- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ మంగళవారం సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా త్రాగునీటి సమస్య లేకుండా వాడవాడల్లో బోర్లు వేయించారు. అనంతరం వీధిలైట్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి నలుమూలల్లో రహదారుల ఇబ్బందులను దూరం చేస్తూ అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు టీచర్స్ కాలనీలో రూ.10 లక్షల నిధులతో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ పనితీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



