Wednesday, August 12, 2026
E-PAPER
Homeఖమ్మంసొంత నిధులతో డ్రైనేజీ నిర్మాణం

సొంత నిధులతో డ్రైనేజీ నిర్మాణం

- Advertisement -

– కౌన్సిలర్ భూక్య ఉదయ్ జ్యోతికి 14వ వార్డు ప్రజల అభినందనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా ప్రజల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అశ్వారావుపేట మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ భూక్య ఉదయ్ జ్యోతి ముందుకు వచ్చారు. తన సొంత నిధులతో వార్డులో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయించారు.

14వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో కొంతకాలంగా మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీటి కారణంగా దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తి పెరిగి ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యను స్థానికులు కౌన్సిలర్ భూక్య ఉదయ్ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య తీవ్రతను గుర్తించిన కౌన్సిలర్ ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తక్షణమే స్పందించారు. తన సొంత ఖర్చులతో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయించారు. దీంతో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

“14వ వార్డు సమస్యలే నా సమస్యలు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడమే నా ప్రథమ కర్తవ్యం” అనే దృక్పథంతో డాక్టర్ ఉదయ్ జ్యోతి వ్యవహరించారని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సమస్య పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత నిధులు వెచ్చించిన కౌన్సిలర్‌కు 14వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -