నవతెలంగాణ – రామారెడ్డి
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దదారులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ లబ్ధిదారులను సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని రెడ్డిపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడుతూ… గ్రామానికి 55 ఇండ్లు మంజూరయ్యాయని, 1 పూర్తి కాగా, 18 వివిధ దశల్లో ఉన్నాయని, 36 మంది లబ్ధిదారులు ఇంకా ప్రారంభించలేదని, వారు వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం నుండి సబ్సిడీ రూ.5,00,000 లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి జైపాల్ రెడ్డి, శిక్షణ కలెక్టర్ రవితేజ, ఎంపీడీవో నాగేశ్వర్, ఎంపీఓ తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ బలరాం, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలి: అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



