- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ లో గృహ నిర్మాణాలు మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. జుక్కల్ మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన గుణ నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో కొన్ని ఇండ్లు పూర్తయితాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు , సొసైటీ చైర్మన్ శివానంద్, గృహ నిర్మాణ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -