నవతెలంగాణ – దుబ్బాక
ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేయడం వల్ల నిరంతర ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ తో పాటుగా ఇతర పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చని ఏడీఏ (వ్యవసాయ శాఖ సహాయక సంచాలకులు) కంపాటి మల్లయ్య తెలిపారు. గురువారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి లో గుండెల రవి అనే రైతుకు చెందిన రెండెకరాల పొలంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 114 ఆయిల్ పామ్ మొక్కలను నాటడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా దుబ్బాక డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి డీ. రమేష్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటకు చీడపీడల బాధ తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుందని వెల్లడించారు. ఆయిల్ పామ్ మొక్కల్ని నాటిన నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం వస్తుందని,ప్రభుత్వం దీనికి మంచి మద్దతు ధరను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎల్.మురళి, ఏఈఓ సంధ్య, మాజీ సర్పంచ్ సద్ది రాజిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు నిరంతర ఆదాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES