మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గం లో అమలవుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాదులో మంత్రి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, గృహ నిర్మాణాలతో పాటు భూ సంబంధిత సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టాలని పథకాలను వేగంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరానని తెలిపారు. స్పందించిన మంత్రి నియోజక వర్గ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తాను అన భరోసా ఇచ్చారు.
.