హైదరాబాద్‌లో ‘ఆల్‌పెట్స్’ క్లినిక్ ప్రారంభం
హైదరాబాద్ : పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే ఆల్‌పెట్స్ సంస్థ తన భారీ ఫ్లాగ్‌షిప్ కేంద్రం ‘క్లినిక్ అండ్ బియాండ్’ను బంజారా హిల్స్‌లో ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ప్రముఖ నటుడు జగపతి బాబు లాంచనంగా ప్రారంభించారు. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యం అందించాల్సిన అవసరం నేడు ఎంతో ఉందని, ఆ దిశగా ఆల్‌పెట్స్ వేస్తున్న అడుగులు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో 15 వేలకు పైగా మూగజీవాలకు తాము సేవలందించామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ జస్లీన్ కౌర్, సహ వ్యవస్థాపకుడు ఎం. తిరుమలై తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా తమ సేవలను విస్తరించనున్నామన్నారు.



