సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్
చిత్ర పరిశ్రమలో తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు శనివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ముందు భారీ నిరసన ప్రదర్శనను చేపట్టారు.
ఈ నిరసనకు జస్టిస్ చంద్రకుమార్, నిర్మాత, నటుడు అశోక్ కుమార్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్ హాజరై సినీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ తెలం గాణ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ, ‘ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంలో కార్మిక శాఖ వెంటనే జోక్యం చేసుకుని ప్రజా స్వామ్యాన్ని, సినిమా కార్మికుల హక్కులను కాపాడాలని కోరుతున్నాం. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి. గత ఎన్నికల సందర్భంగా తమ మేనిఫెస్టోలో సీరియల్ నెంబర్ 34లో పేర్కొన్న విధంగా అవినీతిని ప్రక్షాళన చేయాలని అన్నారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీకి చైర్మన్‌గా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు. ఆఫీస్ బారుగా తన కెరీర్‌ని ప్రారంభించిన వల్లభనేని ఈరోజు వందల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నిస్తున్నాను’ అని అన్నారు. చిత్రపురి సాధన సమితి, సినిమా కార్మిక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నిర్మాతలు ప్రతాని రామకష్ణ గౌడ్, జెవి మోహన్ గౌడ్, శంకర్‌తో పాటు సీఐటీయూ నాయకులు సి.మల్లేష్, పరిశ్రమ నాయకులు మద్దినేని రమేష్, భద్ర, కస్తూరి శ్రీనివాస్, సంకూరి రవీందర్, హేమ జిల్లోజు, గుర్రం రాజు, సిహెచ్ శ్రీనివాస్, గోవింద్, శంకర్ యాదవ్, నామాల రాము తదితరులు పాల్గొన్నారు
చిత్రపురి హౌసింగ్ సొసైటీలోని అవినీతిని ప్రక్షాళన చేయాలి
- Advertisement -
- Advertisement -