Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆబ్కారీ శాఖలో అవినీతి

ఆబ్కారీ శాఖలో అవినీతి

- Advertisement -

ఎమ్మెల్యే హరీశ్‌రావు చిట్‌ చాట్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇప్పటికే పలు అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కున్న రేవంత్‌ సర్కార్‌.. ఇప్పుడు మరో భారీ అవినీతికి తెరతీసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మధ్యం టెండర్లకు సంబంధించి మైక్రో బ్రూవరీస్‌కు 110 అప్లికేషన్లు వచ్చాయనీ, వాటిలో 25 మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిపారు. మంత్రి కోటా కింద నాలుగు, ముఖ్య నేత కోటా కింద 21 సెలెక్ట్‌ చేసుకున్నారని ఆరోపించారు.

ఒక్కొక్క బ్రేవరీకి రూ. కోటి 80 లక్షల ధర నిర్ణయించారని తెలిపారు. ఇందులో కోటిన్నర ముఖ్యనేతకు, మిగతా రూ.30 లక్షలు వాటా లుగా నిర్ణయించారని ఎద్దేవా చేశారు. 110 అప్లికేషన్లు వచ్చాయి అంటున్నారు కదా.. వైన్స్‌లకు లాటరీ తీసినట్టు వీటికి ఎందుకు తీయటం లేదని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లిక్కర్‌ సరఫరా చేసే సంస్థలకు రూ.4,500 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి పేరుకుపోయాయని ఈ ప్రభుత్వం బీర్‌ కంపెనీలకిచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. మెదక్‌ జిల్లా సింగూరు డ్యాం రిపేర్‌ పేరు మీద రైతులకు క్రాఫ్‌ హాలిడే ప్రకటించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -