Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రారంభమైన పత్తి సాగు..

ప్రారంభమైన పత్తి సాగు..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: ఇటీవల కురిసిన వర్షాలకు మద్నూర్ మండలంలోని అవల్గావ్ శివారులో గురువారం వ్యవసాయదారులు కూలీలతో పత్తి పంట సాగును చేశారు. వానాకాలం పంట సాగులో భాగంగా పత్తి పంట సాగు ఈ ఏడాది మీరుగం కంటే ముందుగానే సాగు చేయడం విశేషం. ప్రతి సంవత్సరం జూన్ 7 లేదా 8 తేదీన మీరుగం పండుగ జరుపుకుంటారు. ఆ తర్వాత వర్షాలు పడగానే పంట సాగు చేస్తారు. ఈ ఏడాది మిరుగం కంటే ముందుగానే వర్షాలు పడి సాగుకు అనుకూలంగా ఉన్నట్లుగా వ్యవసాయదారులు భావిస్తూ ముందుగా ఒక పత్తి పంటకె ముగ్గు చూపుతూ సాగు చేస్తున్నారు. ఇక మిగతా పంటలు మిరుగం తర్వాతనే సాగు చేసే విధంగా వ్యవసాయదారులు ఆలోచనలో ఉన్నారు. పత్తి పంట సాగుతో ఈ ఏడాది వానాకాలం పంట సాగు ప్రారంభమైనట్లే జూన్ మాసం సాగుకు అనుకూలమని, వ్యవసాయదారులు భావిస్తారు మీరుగం ముందైనా తర్వాత అయినా పంట సాగు కొందరు వ్యవసాయదారులు ధైర్యంగా చేస్తున్నారు. పత్తి పంట సాగు రైతులకు వర్షాలు ఏ విధంగా సహకరిస్తాయి అనేది వచ్చే 10, 15, రోజులు సమయం వేచి చూడవలసిందే వర్షాలు కురిస్తే సాగు రైతులకు అనుకూలం వర్షాలు పడకపోతే నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని రైతులు భావిస్తున్న కూడా సాగు మాత్రం చేస్తున్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad