Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృష్ణ నాచురల్ ఫైబర్ పత్తి మిల్లులో పత్తి కొనుగోలు ప్రారంభం

కృష్ణ నాచురల్ ఫైబర్ పత్తి మిల్లులో పత్తి కొనుగోలు ప్రారంభం

- Advertisement -

పత్తి ధర క్వింటాలుకు రూ.7220 ప్రకటన
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ పరిధిలోని కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మిల్లులో బుధవారం ప్రయివేట్ పరంగా పత్తి కొనుగోళ్ళను ప్రారంభించారు. పత్తి ధర క్వింటాలుకు రూ.7220 ప్రకటించి కొనుగోలు జరిపారు. ముందుగా పత్తి మిల్లు యజమాని కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మార్కెట్ కమిటీ అధికారులు, పత్తి ప్రైవేటు కొనుగోళ్ల ఖరీదు దారుల కలిసి పత్తిని పరిశీలిస్తూ ధరను ప్రకటించారు .ఈ పత్తి కొనుగోళ్ల ప్రారంభోత్సవంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు సిబ్బందితోపాటు ప్రైవేటు పత్తి మిల్లుల ఖరీదు దారులు కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -