నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాకలో నూతనంగా నిర్మించబోయే కోర్టు భవన నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమా దేవితో కలిసి ఆమె దుబ్బాకలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కోర్టు హాల్, సిబ్బందికి క్వార్టర్స్, వాహన పార్కింగ్ కోసం అవసరమయ్యే స్థలాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఇబ్బంది కలగకుండా సేకరించాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. వారి వెంట జిల్లా ప్రథమ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జయ ప్రసాద్, దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జ్ జితేందర్, ఆర్టీవో సదానందం, ఆర్అండ్ బీ డీఈ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ సంజీవ్ కుమార్, దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, కోర్టు సూపరిండెంట్ యాదగిరి పలువురున్నారు.
కోర్టు భవన స్థల సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES