– రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టెనోగ్రాఫర్, అటెండర్లు
– జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల రైడ్స్ కలకలం సృష్టించాయి. జిల్లా కోర్టులో సిబ్బంది రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. గణపురం మండలానికి చెందిన ఓ రైతు సర్టిఫైడ్ కాపీ కోసం కోర్టు సిబ్బందిని సంప్రదించాడు. ఈ క్రమంలో సిబ్బంది పాలకుర్తి సాయిచరణ్ (స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, కొమ్ము సునీత రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిని శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రాజు, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ వలలో కోర్టు సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



